గతేడాది కోల్ కతా నైట్ రైడర్స్ ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్... ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తనకున్న మంచి జట్టుతో అద్భుతమైన విజయాలు సాధిస్తూ పంజాబ్ పాయింట్లు పెంచుతున్నాడు. మరి ఈరోజు అదే కోల్ కతాను ఢీకొట్టనున్నాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. లాస్ట్ ఇయర్ కప్ గెలిచి పెట్టిన జట్టు నుంచి బయటకు వచ్చేసిన అయ్యర్ దానికి స్పెసిఫిక్ రీజన్ మాత్రం ఏంటో ఎప్పుడూ చెప్పలేదు. కెప్టెన్ గా కప్ గెలిచి పెట్టినా ఆటగాడిగా అంత ఫామ్ లో లేడని లాస్ట్ టైమ్ కేకేఆర్ భావించి ఉండొచ్చు. కానీ తర్వాత ఫామ్ ను అందిపుచ్చుకున్న శ్రేయస్ అయ్యర్ అటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇటు పంజాబ్ కి బ్యాటర్ గానూ ఇరగదీస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో 250 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతూ ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు అయ్యర్. మరి అంతటి ఫామ్ లో ఉన్న అయ్యర్ ఈ రోజు కోల్ కతాను కెప్టెన్ గా బ్యాటర్ గా ఎలా ఎదుర్కోనున్నాడనే విషయమే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టీమ్ బలాబలాలు చూసుకుంటే పాయింట్ల పట్టికలో కోల్ కతానే ప్రస్తుతం పైన ఉన్నట్లు కనిపిస్తున్నా పంజాబ్ దుర్భేధ్యంగా ఉంది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యతో మొదలు పెడితే అశుతోష్ శర్మ వరకూ ప్రతీ బ్యాటర్ టచ్ లోనే ఉన్నాడు. బౌలింగ్ కూడా అంతే టాప్ క్లాస్ గా ఉంది. అభిషేక్ శర్మ చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు కానీ లేదంటే మొన్న పంజాబ్ హైదరాబాద్ మ్యాచ్ లో ఏకంగా 245పరుగుల టార్గెట్ పెట్టింది. మరో వైపు కేకేఆర్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అజింక్యా రహానే కూల్ అండ్ కామ్ నెస్ కి తోడు నరైన్ కొండంత అండగా ఉంటున్నాడు అటు బ్యాటింగ్ కి ఇటు బౌలింగ్ కి తురుపు ముక్కలా మారి కోల్ కతా విజయాల్లో కీరోల్ పోషిస్తున్నాడు. రింకూ సింగ్ కూడా ఫామ్ లోకి రావటం కేకేఆర్ కు హ్యాపీ. రస్సెల్ కూడా తన స్థాయికి తగినట్లుగా ఆడితే కేకేఆర్ నుంచి పంజాబ్ కి రిస్కే. చూడాలి మరి గతేడాది కప్పు తెచ్చి పెట్టిన కెప్టెన్ ఈ సారి కేకేఆర్ కు చేతిలో చిప్ప పెడతారేమో.